LOADING...
Raidurg Land rates: రాయదుర్గం నాలెడ్జి సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ-వేలం
రాయదుర్గం నాలెడ్జి సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ-వేలం

Raidurg Land rates: రాయదుర్గం నాలెడ్జి సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ-వేలం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు ప్రసిద్ధి గచ్చిబౌలి ప్రాంతానికి సమీపంలో ఉన్న రాయదుర్గం ప్రాంతంలోని ఖాళీగా ఉన్న భూములు అత్యంత ఖరీదైనవి. ఈ ప్రాంతంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి, వేలానికి టీజీఐఐసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో ఎకరాకు ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించబడింది. అక్టోబరు 6న ఈ భూముల ఈ-వేలానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం అంచనా వేసినట్లు, ఈ వేలం ద్వారా కనీసం రూ.2,000 కోట్ల వరకు ఆదాయం ఏర్పడుతుంది.

వివరాలు 

పెట్టుబడిదారులకు అనువైన భూములు 

ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో ప్రధానంగా భూముల వేలం విషయాన్ని చర్చించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం నాలెడ్జి సిటీలో భూముల వేలానికి ప్రాధాన్యత ఇచ్చారు. చుట్టుపక్కల బహుళ అంతస్తుల భవనాలతో కూడిన ఈ ప్రాంతంలో అమ్మకానికి పెట్టిన భూములు పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనవని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల టి-హబ్‌లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో పలు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు పాల్గొన్నారు. భూమి ప్రత్యేకతలను ప్రభుత్వ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. పలు సంస్థలు ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా పేర్కొనబడింది.

వివరాలు 

బిడ్‌ దాఖలుకు అక్టోబరు 1 గడువు 

భూమి వివరాలు: సర్వే నంబరు 83/1లో ప్లాట్‌ నంబరు 19లో 11 ఎకరాలు.. ఇదే సర్వే నంబరులో ప్లాట్‌ నంబరు 15ఎ/2లో 7.67 ఎకరాలను పారదర్శకంగా వేలం వేయడానికి ఈ-ఆక్షన్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. నోటిఫికేషన్: 3 సెప్టెంబరు 2025 బ్రోచర్ లభ్యత: 5 సెప్టెంబరు 2025 బిడ్ దాఖలుకు చివరి తేదీ: అక్టోబరు 1, 2025 - సాయంత్రం 5 గంటల వరకూ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,180 (జీఎస్టీ సహా, రిఫండబుల్ కాదు) బిడ్ డాక్యుమెంట్ ఫీజు: ప్రతి ప్లాట్‌కు రూ.10 లక్షలు + జీఎస్టీ (నాన్-రిఫండబుల్)

వివరాలు 

బిడ్‌ దాఖలుకు అక్టోబరు 1 గడువు 

రిజర్వ్ ధర: ప్లాట్ నం.19 - 11 ఎకరాలు, ఒక్కో ఎకరాకు రూ.101 కోట్లు, ప్లాట్ నం.15ఎ/2 - 7.67 ఎకరాలు, ఒక్కో ఎకరాకు రూ.101 కోట్లు బిడ్ పెంపు: కనీసం రూ.50 లక్షలు ఎకరాకు లేదా దాని గుణింతాలుగా భూమి సందర్శనకు గడువు: 05 సెప్టెంబరు 2025 నుంచి 04 అక్టోబరు 2025 వరకు ఈ-వేలం: అక్టోబరు 6, 2025 - మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు