
Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్
ఈ వార్తాకథనం ఏంటి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విస్త్రృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విలేకరులనుంచి శశిథరూర్ కు ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది.
ప్రధాని నరేంద్ర మోదీకి పోటీ దారు ఎవరు అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు శశిథరూర్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
Details
తిరువంతపురం నుండి మూడు సార్లు ఎంపీగా ఎన్నిక
''పార్లమెంట్ వ్యవస్థలో ఇటువంటి ప్రశ్నఅసంబద్ధం.అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరిగా మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ బహుళత్వం,వైవిధ్యం,సమ్మిళత వృద్ధిని సంరక్షించుకోవడం కోసం రూపొందించిన విధానాలను పాటించే పార్టీని ఎన్నుకుంటాం.వ్యక్తిగత అహాన్ని పక్కన బెట్టి ప్రజా సమస్యలపై పోరాడే వివిధ నాయకుల సమూహమే ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం.ఆ సమూహంలో నుంచి ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలన్నది తర్వాతి విషయం. ప్రజాస్వామాన్ని, భిన్నత్వాన్ని పరిరక్షించుకోవడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం అంటూ విలేకరులకు సమాధానమిచ్చారు.
కేరళలో తిరువంతపురం ఎంపీగా బరిలో నిలిచిన శశిథరూర్ అదే నియోజకర్గం నుంచి ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
శశిథరూర్ పై ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్,వామపక్షాల నుంచి పన్నియన్ రవిందర్ బరిలో ఉన్నారు.