Page Loader
16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్ 
16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్

16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్ 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రోహిణి ప్రాంతంలో అతడు ఆ బాలికను దాదాపు 20సార్లు కత్తితో పొడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలను విడిచింది. ఆ బాలిక, సాహిల్‌ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య జరగడానికి ఒక రోజు ముందు ఇద్దరు గొడవ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నట్లు దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా తెలిపారు. 20ఏళ్ల సాహిల్‌ ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్‌గా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నిందితుడి అరెస్టును వెల్లడించిన డీసీపీ నల్వా