
#NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ ప్రతీకార చర్యగా జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై పాకిస్తాన్ చేసిన దాడికి కౌంటర్ అటాక్ చేపట్టింది.
డ్రోన్లు, మిస్సైళ్లు వాడి పాకిస్తాన్ నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ పై దాడులు చేసిన భారత్, వాటిని సమర్థంగా అడ్డుకుంది.
పాకిస్తాన్ దాడి
గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్ముకశ్మీర్ పై భారీ దాడి ప్రారంభించింది.
తొలుత డ్రోన్లతో దాడి, తరువాత మోర్టార్ షెల్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. మొత్తం నిమిది మిస్సైళ్లను ప్రయోగించినప్పటికీ వాటన్నింటినీ భారత ఆర్మీ 'ఇంటర్‌సెప్ట్' చేసి కూల్చివేసింది.
Details
ఆకాష్ క్షిపణి పాత్ర ఇదే
ఈ మిస్సైళ్ల దాడిని భారత ఆర్మీ ఆకాష్ గగనతల రక్షణ క్షిపణి ద్వారా నిలువరించింది. ఆకాష్ క్షిపణి వందశాతం స్ట్రైక్ రేటును అందించగలుగుతుంది.
డ్రోన్ అటాక్‌ను కూడా ఈ క్షిపణి సమర్థంగా నిర్వీర్యం చేసింది.
ఆకాష్ క్షిపణి
ఈ ఆకాష్ మిస్సైల్ మే డ్ ఇన్ ఇండియా ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. దీని రూపకల్పన డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చేసిందని భారత ఆర్మీ వెల్లడించింది.
ఈ క్షిపణి 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది.
Details
ఆకాష్ మిస్సైల్ ఎగుమతులు
భారత ప్రభుత్వం ఆకాష్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేయాలని 2020లో నిర్ణయించింది.
మొత్తం 5 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆకాష్ క్షిపణి ప్రత్యేకతలు
1. మల్టిపుల్ ఎయిర్ అటాక్స్ - ఒకేసారి ఓవర్ ద బార్డ్ ఎటాక్స్ (మిస్సైళ్ల, డ్రోన్లను) నాశనం చేసే సామర్థ్యం.
2. రియల్-టైమ్ డేటా ప్రాసెసింగ్ - దాడి జరుగుతున్న సమయంలో, దానిని ముందుగానే అంచనా వేసే శక్తి.
3. ఎలాంటి దిశ నుంచి దాడులు వచ్చినా వాటిని అదే సమయంలో అడ్డుకోవచ్చు.
Details
భారత ఆర్మీ స్పందన
పాకిస్థాన్ సాయుధ దళాలు జమ్ముకశ్మీర్ పశ్చిమ సరిహద్దుపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసినప్పుడు, ఆకాష్ క్షిపణి విజయవంతంగా వాటిని అడ్డుకోవడంలో కృషి చేసింది.
భారత ఆర్మీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి కట్టుబడి ఉందని పేర్కొంది.
Details
సత్తా చాటిన 'S-400 సుదర్శన్ చక్ర'
మరోవైపు భారత్ కు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'S-400 సుదర్శన్ చక్ర' మరోసారి తన సత్తా చాటింది.
పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లోని 15 ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయాలని చేసిన ప్రయత్నాలను S-400 సమర్థవంతంగా అడ్డుకుంది.
పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను ధ్వంసం చేసింది. అంతేకాక, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'HQ-9'ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది.
భారత్ డ్రోన్లు లాహోర్, సియాల్ కోట్ వరకు ప్రవేశించి HQ-9 వ్యవస్థను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లకు చెక్ వేసిన భారత్, లాహోర్‌తో పాటు 9 ప్రధాన నగరాల్లో డ్రోన్లతో దాడి చేసింది.
Details
క్షీణించిన పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ
ఇందులో ఇజ్రాయెల్ అందించిన అత్యాధునిక డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ డ్రోన్ల దెబ్బకు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పనికిరాని స్థితికి చేరింది.
గత రాత్రి పాక్ డ్రోన్లు, మిస్సైళ్లతో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి వంటి సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించగా, వాటిని S-400 సమర్థవంతంగా ఎదుర్కొంది.
ఈ విషయాన్ని రక్షణ మంత్రి స్వయంగా వెల్లడించారు.
Details
S-400 సుదర్శన్ చక్ర సామర్థ్యం
ఒక్క స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు, ఒక్కొక్కదానిలో 6 లాంచర్లు
ప్రతి బ్యాటరీ 128 క్షిపణుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది
ఇది 400 కి.మీ దూరం వరకూ వాయు ముప్పులను గుర్తించగలదు
స్టెల్త్ ఫైటర్‌లు, డ్రోన్‌లు, క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిస్సైళ్లను ఎదుర్కొంటుంది
లేయర్డ్ డిఫెన్స్ కు అనువుగా బహుళ రకాల క్షిపణులు ఉపయోగిస్తుంది
భారత్ 2018లో రష్యాతో చేసిన రూ.35 వేల కోట్ల రూపాయల ఒప్పందం మేరకు ఐదు S-400 స్క్వాడ్రన్‌లను కొనుగోలు చేసింది.
ఇప్పటికే మూడు స్క్వాడ్రన్‌లు సేవలో ఉండగా, మిగిలిన రెండు 2026 నాటికి సిద్ధమవుతాయి.