
AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ వేళ.. సంప్రదాయాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా కోడిపందాలు, పేకాటపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఉపేక్షించేదని లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కోడి పందాల నిర్వహకులు, కోడి కత్తుల తయారీదారులపై నిఘా పెట్టారు.
కొన్ని ప్రాంతాల్లో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.
సంక్రాంతి పండగ వేళ.. జూదం ఆడటం వల్ల వారి కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
ఎవరైనా జిల్లాలో కోడి పందాలు నిర్వహణకు స్థలాలు ఇచ్చినా.. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోడి పందాలపై ఉక్కుపాదం
సంక్రాంతి పండుగని కోడిపందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవు: ఏపీ పోలీసుల వార్నింగ్!! https://t.co/PcekJXw7OY #cockfight via @oneindiatelugu
— Dr.Veenasrinivas (@DrVeenasrinivas) January 8, 2024