Page Loader
ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు
ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు

ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు

వ్రాసిన వారు Stalin
Mar 29, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా సాగుతున్నాయి. అదానీ, రాహుల్ గాంధీల వ్యవహారాలతో నెలకొన్న ఆందోళనల కారణంగా ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 3మూడు కీలక బిల్లు ఆమోదం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) బిల్లు- 2023, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు- 2022, కాంపిటీషన్ (సవరణ) బిల్లు- 2022, ఈ మూడింటిని ఈ సమావేశాల్లోనే ఉభయ సభల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని కేంద్రం యోచిస్తోంది. రక్షణ సేవలకు సంబంధించిన ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) బిల్లు- 2023ను ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. మిగతా రెండు బిల్లులను జాబితా చేశారు.

పార్లమెంట్

సభలకు అంతరాయాలు కలిగినా బిల్లుల ఆమోదానికే కేంద్రం మొగ్గు

అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం ప్రతిపక్షం డిమాండ్ చేయడం, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని పాలకపక్షం ఆందోళనల నేఫథ్యంలో ఉభయ సభల్లో బిల్లులపై ఎలాంటి చర్చ జరగడం లేదు. ఫైనాన్స్ బిల్లు, గ్రాంట్ల డిమాండ్ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించబడ్డాయి. ఇదిలా ఉంటే, మంగళవారం మూడు బిల్లులపై చర్చకు రెండు గంటల సమయం కేటాయించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు సమావేశాలు జరగనుండగా.. ఇంకా నాలుగు పనిదినాలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నాలుగు రోజుల్లో ఈ బిల్లులను కచ్చితంగా ఆమోదించాలనే యోచనలో కేంద్రం ఉంది. ఉభయ సభలకు అంతరాయాలు కొనసాగే అవకాశం ఉన్నందున గందరగోళం మధ్య కూడా బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.