Pawan Kalyan: కూటమి ప్రభుత్వం మెతక కాదు.. అధికారులకు పవన్ హెచ్చరిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రభుత్వం మెతక తీరును అనుసరించదని, ఇదే సమయంలో మంచి పరిపాలన అందించడంలో వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఐఏఎస్ అధికారులపై అనవసర ఒత్తిళ్లు పెట్టినా, వార్నింగ్‌లు ఇచ్చినా కేసులు పెడతామని కూడా హెచ్చరించారు. ఇక పవన్ వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు అధికారులను వినియోగించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారులపై చిన్న గాటు పడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
షర్మిళ భద్రత విషయంలో మరింత ప్రాధాన్యత
కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత విషయంలో మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మహిళా భద్రత కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటవీశాఖకు తన సంపూర్ణ మద్దతు ఉన్నట్టు తెలియజేసిన పవన్ కల్యాణ్ అడవులను రక్షించేందుకు అధికారులు అవసరమైన అన్ని స్వేచ్ఛలు కల్పిస్తామని చెప్పారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు మరిచిపోరాదని, అటవీశాఖకు విరాళాల సేకరణలో రూ.5 కోట్లు సేకరించి అందిస్తామన్నారు. స్మగ్లింగ్ వంటి సమస్యల నుంచి అడవులను రక్షించేందుకు సహాయం అందిస్తామని తెలిపారు.