CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. "మేము ఇప్పటికే గోదావరి,కృష్ణా నదులను అనుసంధానం చేసి లక్షల ఎకరాలకు ప్రయోజనం అందించాం. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటి కొరత లేకుండా సరఫరా చేయవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి నుండి కృష్ణా వరకు, అలాగే కృష్ణా నుండి పెన్నా వరకు నీటి అనుసంధానంపై బుధవారం జలవనరులశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే ప్రణాళిక
జలవనరులశాఖ ఇచ్చిన ప్రజంటేషన్‌పై వివరణ ఇవ్వడమైనది. ముఖ్యంగా, పోలవరం కుడికాలువను విస్తరించి 40 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో గోదావరి వరద జలాలను మళ్లించడం, అలాగే ప్రత్యేకంగా వరద కాలువ తవ్వి పోలవరం నీటిని మళ్లించడం వంటి ప్రతిపాదనలపై సానుకూల, ప్రతికూల అంశాలను కూడా సీఎం వివరించారు. కృష్ణా దాటిన తర్వాత బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి,అక్కడి నుంచి సోమశిలకు తరలించే ప్రతిపాదనను,అలాగే బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీటిని తీసుకువెళ్లే ప్రతిపాదనను కూడా సీఎం పరిశీలించారు. ''గోదావరి జలాలే కాకుండా,కృష్ణా వరద జలాలను కూడా బొల్లాపల్లికి తరలించే ప్రణాళికను రూపొందించాలని''సీఎం సూచించారు. కృష్ణా వరద ఉన్నప్పుడు ఆ నీటిని తరలించేలా,లేని సమయంలో గోదావరి జలాలను మళ్లించేలా ప్రణాళికను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు.
22 తర్వాత పోలవరానికి...
ఈ అంశంపై మూడోపక్షంతో అధ్యయనం చేయించాలని, శాసనసభ సమావేశాలు పూర్తయ్యాక మరొకసారి సమీక్షా నిర్వహించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, విదేశీ నిపుణులతో జరిగిన చర్చల వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు అందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి షెడ్యూలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. నవంబర్ 22 తరువాత పోలవరం ప్రాజెక్టుకు సందర్శించాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రాజెక్టు పూర్తి అవుటి గడువును ప్రకటించాల్సి ఉందని తెలిపారు.
"ప్రత్యామ్నాయాలు చూడాలి": చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పునరావాసం కోసం 18,925 ఇళ్లు నిర్మించాల్సి ఉందని, ఆ పనులకు సంబంధించిన బిల్లులు రూ.155 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సాయిప్రసాద్ తెలిపారు. 2018లో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, వాటి ప్రకారం పనులు చేయడానికి గుత్తేదారులు సిద్ధంగా లేరని వారు చెప్పారు. "ప్రత్యామ్నాయాలు చూడాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పోలవరం భూసేకరణ, పునరావాసం పనులను సమాంతరంగా చేపట్టాలని, ఇందుకు రూ.2,600 కోట్లు అవసరమని ఆయన చెప్పారు.