Page Loader
Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్ 
నిందితుడి దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్

Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించి ఓ ఫోటో మరియు వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన జైల్లో రాచమర్యాదలు అందుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌పై జైల్లో ప్రత్యేక సౌకర్యాలు అందిస్తున్నట్టు ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫోటోకి సంబంధించి వీడియో సైతం బయటకు రావడం గమనార్హం.

Details

స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడిన దర్శన్

ఆ వీడియోలో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఉంది. ఇందులో దర్శన్‌ తన స్నేహితుడితో మాట్లాడుతుండగా, మరో వ్యక్తి ఫోన్‌ను అతని చేతిలోకి ఇచ్చి పక్కకు వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ 25 సెకన్ల వీడియోలో, దర్శన్‌ వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు దర్శన్‌ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆదివారం జైలు బ్యారక్‌ నుండి బయటకు వచ్చిన దర్శన్‌ను స్నేహితులతో కాఫీ, సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. ఈ ఫోటో వైరల్‌గా మారడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

Details

పోలీసులపై చర్యలు

దర్శన్‌కు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు అందిస్తున్న ఆరోపణల కారణంగా పోలీసు విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. ప్రాథమిక విచారణలో ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని గుర్తించి వారిని సస్పెండ్ చేశామని హోంమంత్రి జి. పరమేశ్వర్ తెలిపారు. నిందితుడికి జైల్లో సకల సౌకర్యాలు అందించడంపై రేణుకాస్వామి తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.