Page Loader
Supreme Court: బెయిల్ వచ్చిన మర్నాడే కేబినేట్‌లోకి?.. అక్కడ ఏం జరుగుతోందంటూ సుప్రీం ఆందోళన 
బెయిల్ వచ్చిన మర్నాడే కేబినేట్‌లోకి?.. అక్కడ ఏం జరుగుతోందంటూ సుప్రీం ఆందోళన

Supreme Court: బెయిల్ వచ్చిన మర్నాడే కేబినేట్‌లోకి?.. అక్కడ ఏం జరుగుతోందంటూ సుప్రీం ఆందోళన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ చర్యలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో జైలు జీవితాన్ని ముగించి, బెయిల్‌పై విడుదలైన వెంటనే మంత్రిగా ప్రమాణం చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తూ, సుప్రీం కోర్టు అక్కడ అసలు ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది. సెంథిల్ బాలాజీ బెయిల్ రీకాల్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో సాక్షులపై ప్రభావం ఉండకమానదని సుప్రీం అభిప్రాయపడింది. అయితే బెయిల్ రద్దు గురించి ఇప్పుడు విచారణ జరిపేది లేదని, కానీ సాక్షులపై ప్రభావం చూపించే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది.

Details

మనీలాండరింగ్ కేసులో సెంథిల్ కు జైలు శిక్ష

తదుపరి విచారణ డిసెంబరు 13కు వాయిదా వేసింది. మనీలాండరింగ్ కేసు కారణంగా ఈ ఏడాది సెప్టెంబరులో సెంథిల్ జైలుకు వెళ్లారు. సెప్టెంబర్‌లో బెయిల్ మంజూరు కాగా విడుదలైన మరుసటి రోజే తమిళనాడు మంత్రివర్గంలో తన స్థానాన్ని పునరుద్ధరించుకున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు మంత్రుల ప్రమాణ స్వీకారంలో సెంథిల్ కూడా మళ్లీ మంత్రి అయ్యారు. ఈ పరిణామంపై సుప్రీం బెయిల్ మంజూరులో తప్పేమీ లేదని, కానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.