Page Loader
AI University: దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోనే!
దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోనే!

AI University: దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో దేశంలో తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీని మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్‌ ఇండియా, మహీంద్రా గ్రూప్‌, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్‌ గాంధీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమిషన్‌, డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీ రెండు సార్లు సమావేశమై, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి తుది రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఆశిష్‌ షేలర్‌ తెలిపారు.