నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే హైదరాబాద్‌లో మేధావుల సదస్సులో పాల్గొననున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకొన్నది.
ఇప్పటికే ఈ నెల 1, 3తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి బీజేపీలో మంచి ఊపు తెచ్చారు.
ఈ సందర్భంగా కీలక జాతీయ పసుపు బోర్డు, గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా అమిత్ షా పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరగనుంది.
తెలంగాణ
అమిత్ షా పర్యటన వివరాలు ఇవే..
అమిత్ షా నాగపూర్ నుంతి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నాం 1.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో షాకు రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలుకుతుంది.
అనంతరం ఆయన మధ్యాహ్నం 2.35గంటలకు హెలికాప్టర్ లో ఆదిలాబాద్ వెళ్తారు.
మధ్యాహ్నం 3.00గంటలకు అమిత్ షా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.
ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
సాయంతం 5గంటల హైదరాబాద్‌కు చేరుకొని, ఐటీసీ కాకతీయలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం 6.20 గంటల నుంచి 7.20 వరకు మేథావులతో సదస్సులో పాల్గొంటారు.
అది ముగిసిన తర్వాత బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశం తర్వాత రాత్రి 9:30 నిమిషాలకు దిల్లీకి బయలుదేరుతారు.