Page Loader
కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ 
కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ

కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2023
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. తనను కారుణ్య నియామకానికి అననుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాఖీసింగ్ లేఖ రాశారు. ఈ కేసులోని ఇతర హిందూ పిటిషనర్లు తాను కేసును ఉపసంహరించుకోవడంపై తప్పుడు ప్రచారం చేశారని రాఖీసింగ్ వాపోయారు. ఇది తనకు విపరీతమైన మానసిక బాధను, క్షోభను కలిగించిందని, అందుకే తాను చనిపోవాలని అనుకుంటున్నట్లు అనుమతించాలని రాఖీసింగ్ లేఖలో రాష్ట్రపతిని వేడుకున్నారు. కొన్ని రోజుల క్రితం రాఖీసింగ్ వారణాసి జ్ఞాన్‌వాపి మసీదు కేసులో తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జూన్ 9వ తేదీ నాటికి సమాధానం ఇవ్వాలని రాఖీసింగ్ లేఖలో కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపటిలోగా సమాధానం చెప్పాలని రాష్ట్రపతిని కోరిన రాఖీ సింగ్