Haryana Assembly polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల.. వినేశ్‌పై పోటీలో ఎవరంటే?
హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇంతకుముందు మూడు జాబితాల్లో 40 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 21 మందితో ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం మీద, ఇప్పటివరకు 61 మంది అభ్యర్థులను ప్రకటించింది. జులనా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై పోటీ చేయడానికి మరో రెజ్లర్ అయిన కవితా దలాల్‌ను బరిలోకి దించింది.
అక్టోబర్ 5న పోలింగ్
కవితా 2022లో ఆప్‌లో చేరి, అంతకుముందు డబ్ల్యూడబ్ల్యూఈలో పోటీలకు కూడా ప్రాచుర్యం పొందారు. ఈ నియోజకవర్గంలో భాజపా తరఫున యోగేశ్ బైరాగి పోటీ చేస్తున్నారు. హరియాణాలో మొత్తం 90 శాసనసభ స్థానాలుండగా, అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.