
Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో ఇవాళ మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ్టి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ లోపల, బయట కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదట ప్రభుత్వ బిల్లులపై చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ సవరణ బిల్లులు ముందుగా సభలో ప్రవేశపెట్టబడతాయి. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Details
అల్లర్లు చేస్తే వేటు వేసే అవకాశం
స్పీకర్ పోడియం వద్దకు వచ్చి అల్లర్లు చేసే యత్నం చేస్తే వేటు వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. గతంలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ నివేదికను సీబీఐకి ఇస్తారా..? లేక ప్రత్యేక విచారణ సిట్‌కు అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలకు ఈరోజే సమాధానం వచ్చే అవకాశం ఉంది. సీబీఐ విచారణకు ఇవ్వాలని ఇద్దరు కీలక మంత్రులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
Details
ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. అవి:
1. 2025, తెలంగాణ పురపాలక సంఘాల (మూడవ సవరణ) బిల్లు 2. 2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు 3. 2025, తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల (రిజిస్ట్రికరణ, క్రమబద్ధీకరణ) చట్టాన్ని రద్దు చేయుట కోసం బిల్లు