Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. 1999లో జరిగిన సర్వే ద్వారా ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించిన తర్వాత, ఆ స్థలాల్లో నిర్మాణాలు చేసినవారికి ఎలా నోటీసులు ఇవ్వగలరని పేర్కొంది. మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టినా చట్టం ప్రకారం ఉండాలని ఆదేశించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు మార్కింగ్ చేసిన నేపథ్యంలో అనేక పిటిషన్‌ల ద్వారా అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ జరిపారు.
2100 మంది బాధితులు ఉన్నారన్న కలెక్టర్
ప్రభుత్వ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి, ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడం లేదని వివరించారు. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. దీనిపై బాధితులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారు సుమారుగా 2,100 మంది ఉన్నారని కలెక్టర్ గుర్తించారు. ప్రస్తుతం ఎలాంటి తొలగింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. న్యాయమూర్తి, చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగించడానికి చర్యలు తీసుకోవాలనే హెచ్చరించారు. అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడితే చట్టం ప్రకారం చేయాలని సూచిస్తూ విచారణను అక్టోబర్ 16కి వాయిదా వేశారు.