LOADING...
Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక హెచ్చరికను జారీ చేసింది. రాబోయే కొన్ని రోజులలో రాష్ట్రంలో ఉక్కపోత, వేడి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, సెప్టెంబర్‌ 12 నుంచి 18 మధ్య ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.

Details

మరోవైపు వర్ష సూచన

ఇప్పటికే నిన్న నరసాపురం, బాపట్ల, కావలి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. ఇక ఒకవైపు ఎండల తీవ్రత ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు వర్ష సూచన ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు వాతావరణ నమూనాల ప్రకారం ఈ నెల 10 తర్వాత వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.