
కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కుప్వారా జిల్లాలోని దోబనార్ మచల్ ప్రాంతంలో (ఎల్‌ఓసీ) ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ ను ఇంకా కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) సంయుక్త ఆపరేషన్‌లో లష్కరే తోయిబా సానుభూతిపరుడిని అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి నుంచి రెండు చైనా హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుప్వారా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in Kupwara in joint operation by Army, J-K police#Jammu_&_Kashmir #Two_Terrorists_Neutralised #kupwara #Indian_Army #Kupwara_Policehttps://t.co/JtQbAxsAWo
— Dynamite News (@DynamiteNews_) June 13, 2023