
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తాజా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం ధరలను భారీగా పెంచడం, ప్రభుత్వమే మద్యం విక్రయించేలా పాలసీని మార్చడం, మద్యం తతంగంలో భారీ స్కామ్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
Details
లిక్కర్ స్కాంలో బాంబ్‌షెల్
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మద్యం ధరలను అమాంతం పెంచేసింది.
సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా మద్యం పాలసీని మార్చి, ప్రభుత్వమే విక్రయించేలా వైన్ షాపులను ఏర్పాటు చేసింది.
అయితే వీటి ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయం సంపాదించినప్పటికీ, తక్కువ నాణ్యత గల బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
నిజమెంటో బయటపెట్టిన సిట్ దర్యాప్తు
సిట్ దర్యాప్తులో రూ. 3 వేల కోట్ల స్కాం వెలుగు చూసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిల కనుసన్నల్లో ఈ లావాదేవీలు జరిగాయని తేలింది.
ప్రభుత్వానికి గుట్టుగా పెద్దమొత్తంలో ముడుపులు చేరినట్లు ఆధారాలు లభించాయి.
Details
వైసీపీ నాయకులే టార్గెట్
మద్యం స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. స్కాంలో తన ప్రమేయంపై విచారణ జరుగుతుందనే భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారని ప్రచారం జరుగుతోంది.
ఆయన వాంగ్మూలం వల్ల వైసీపీ పెద్దలు ఇరకాటంలో పడతారనే ఊహాగానాలు ఉన్నాయి.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు దారిపట్టిన మిథున్ రెడ్డి
సిట్ విచారణ వేగంగా సాగుతుండటంతో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీల లావాదేవీలను తనే పర్యవేక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇవి నిరాధారమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాల వరకు తనను అరెస్టు చేయొద్దని, కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోరారు.
Details
వైసీపీకి మద్యం స్కామ్ షాక్
ఈ స్కాంలో మరింత మంది వైసీపీ నేతలు ఇరుక్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే సిట్ కీలక ఆధారాలు సేకరించగా, త్వరలోనే మరింత మందిని విచారించే అవకాశం ఉంది.
మద్యం స్కాంలో వైసీపీ పెద్దలు చిక్కుకుతీరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.