LOADING...
Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!
ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!

Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. కాస్త రిలాక్స్‌ కావడానికి మంచి బార్‌ కోసం వెతికే మందుబాబులకు ఇది హాట్‌ అప్‌డేట్‌. ప్రతీ ఏటా ప్రకటించే 'ఇండియాస్‌ 30 బెస్ట్‌ బార్స్‌ - 2025' ర్యాంకింగ్స్ తాజాగా వెలువడ్డాయి. అయితే ఈసారి ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎప్పుడూ అగ్రస్థానాల్లో ఉండే ముంబై, ఢిల్లీ నగరాలను వెనక్కి నెట్టి దక్షిణాది నగరం 'బెంగళూరు' నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. గోవాలో నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది టాప్‌-5లో నిలిచిన బార్లు ఏవో, హైదరాబాద్‌ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Details

నెం.1 బార్‌గా 'బార్ స్పిరిట్ ఫార్వర్డ్'

2025 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ బార్‌గా బెంగళూరుకు చెందిన 'బార్ స్పిరిట్ ఫార్వర్డ్' నిలిచింది. వినూత్నమైన కాక్‌టెయిల్స్‌, ఆకట్టుకునే యాంబియెన్స్‌తో ఈ బార్‌ జ్యూరీని మెప్పించింది. మరో విశేషం ఏంటంటే.. రెండో స్థానాన్ని కూడా బెంగళూరుకే చెందిన 'సోకా' బార్‌ దక్కించుకోవడం. దీంతో టాప్‌లో బెంగళూరు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది టాప్‌-5లో నిలిచిన బార్లు ఇవే బార్ స్పిరిట్ ఫార్వర్డ్ - బెంగళూరు సోకా - బెంగళూరు బార్ అవుట్రిగ్గర్ - గోవా బాయిలర్ మేకర్ - గోవా లేయర్ (Lair) - న్యూఢిల్లీ

Details

హైదరాబాద్‌ హవా కొనసాగుతోంది

తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లోని బార్లు కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కిన్-రూ బార్ 22వ స్థానంలో నిలిచి హైదరాబాద్‌కు గర్వకారణంగా మారింది. మరోవైపు రూ (RU) బార్ 26వ స్థానంలో నిలిచి నగరంలోని బార్‌ కల్చర్‌ స్థాయిని చాటిచెప్పింది.

Advertisement

Details

ముంబై-ఢిల్లీకి షాక్

గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల చరిత్రలో తొలిసారిగా టాప్‌-4 స్థానాల్లో ముంబై లేదా ఢిల్లీకి చెందిన ఒక్క బార్‌ కూడా లేకపోవడం విశేషంగా నిలిచింది. ముంబైకి చెందిన పాపులర్‌ బార్‌ 'అమెరికానో' ఈసారి 10వ స్థానానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 250 మందికి పైగా బార్‌ నిపుణులు, ఫుడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు, జ్యూరీ సభ్యులు కలిసి ఈ ర్యాంకింగ్స్‌ను నిర్ణయిస్తారు. డ్రింక్స్‌ క్వాలిటీ, సర్వీస్‌, ఇంటీరియర్‌, అక్కడ లభించే స్నాక్స్‌ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Advertisement