Madhya Pradesh Deputy Chief Minister:మధ్యప్రదేశ్ కొత్త ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవదా.. ఆయన ఎవరంటే..!
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరాలతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కొత్త ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవదా షెడ్యూల్డ్ కులానికి (SC) చెందినవారు. ఆయన 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మల్హర్‌ఘర్ స్థానం నుండి పోటీ చేసి 59,024 ఓట్లతో గెలిచారు. రాజేంద్ర శుక్లా రేవా అసెంబ్లీ స్థానం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.వింధ్య ప్రదేశ్ ప్రాంతంలో పార్టీకి బలమైన బ్రాహ్మణ ముఖంగా ఎదిగారు.
జగదీష్ దేవదా గురించి తెలుసుకుందాం రండి..
1. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రాంపుర గ్రామంలో జన్మించిన జగదీష్ దేవదా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. 2. రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని నిర్వహించారు. 3. న్యాయవాదిగా శిక్షణ పొందారు.1979లో BJP యువమోర్చా BJP యువజన విభాగం,భారతీయ జనతా యువ మోర్చా (BJYM)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మండల అధ్యక్షుడు,మందసౌర్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు,జిల్లా ప్రధాన కార్యదర్శితో సహా అనేక పదవులు నిర్వహించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా దేవదా
4. దేవదా రాంపురలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థి సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు. తన సంస్థాగత నైపుణ్యాలకు పేరుగాంచిన దేవదా బిజెపిలో అనేక పదవులను అలంకరించారు. 5. 2003లో దేవదా రాష్ట్ర మంత్రిగా హోం, పాఠశాల విద్య, ఇంధన శాఖలను కూడా నిర్వహించారు. దేవదా 2020లో మార్చి 24 నుండి జూలై 2 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు.