
Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమ జంట కొన్ని గంటలు కూడా కలిసి జీవించలేకపోయారు.
పెళ్లైన గంటల వ్యవధిలోనే ఘర్షణ పడి దంపతులిద్దరూ మృతి చెందారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని చంబరనహళ్లి గ్రామానికి చెందిన నవీన్(26), లిఖిత(22)లు ప్రేమించుకొని, ఆగస్టు 7న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం నూతన దంపతులు తమ బంధువులతో కొద్దిసేపు సరాదాగా గడిపారు. అయితే ఈ సరాదా క్షణాలు జీవితాంతం లేకుండా పోయాయి.
లిఖితను అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి నవీన్ తీసుకెళ్లాడు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఓ గదిలో ఇద్దరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లిఖితపై నవీన్ కత్తితో పొడిచాడు.
బంధువులు వచ్చి చూడగా అప్పటికే లిఖిత రక్తపు మడుగు పడి మృతి చెందింది.
నవీన్ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతను కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.