NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం
    ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం

    Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 17, 2024
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ - గ్రాండ్ కమాండర్' పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది.

    1969లో క్వీన్ ఎలిజబెత్‌ IIకి ఈ పురస్కారం అందించిన తర్వాత, మోదీ దీనిని అందుకోనున్న మరో ప్రముఖ విదేశీయునిగా రికార్డుకెక్కాడు.

    మోదీకి ఇది 17వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. నైజీరియాలోని అబుజా చేరుకున్న మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో స్వాగతం పలికారు.

    జ్ఞాపికను అందజేస్తూ, భారత ప్రధానిపై ఉన్న విశ్వాసం, గౌరవానికి ఇది ప్రతీక అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాకు చేరుకున్నారు.

    Details

    బ్రెజిల్ వెళ్లనున్న మోదీ

    నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు.

    ఇక్కడి కార్యక్రమాల అనంతరం మోదీ జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ వెళ్లనున్నారు.

    18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా వివిధ దేశాధినేతలు హాజరవుతారు.

    నవంబర్‌ 19న మోదీ గయానాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు 21వ తేదీ వరకు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ మహాత్మా గాంధీ
    Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి భారతదేశం
    West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ భారతదేశం
    PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ మహారాష్ట్ర

    ఇండియా

    TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు  తెలంగాణ
    Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం మాల్దీవులు
    Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల నాగార్జునసాగర్
    Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు! దీపావళి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025