
Farooq Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ దూసుకెళ్తోంది.
కాంగ్రెస్‌తో ముందే పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ ప్రస్తుతం గెలుపు, ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటడంతో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి పదవిని చేపడతారని స్పష్టం చేశారు.
పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును వెల్లడించారని, ఆగస్టు 5 (2019 ఆర్టికల్ 370 రద్దు) నిర్ణయాన్ని వారు తిరస్కరించినట్టు స్పష్టమైందన్నారు.
Details
జమ్ముశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తీసుకొచ్చేందుకు కృషి
ఒమర్ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. జమ్ముశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తెచ్చేందుకు మా కూటమి కృషి చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
జమ్ముశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా, మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
బీజేపీ 29 స్థానాలతో నిలిచింది. పీడీపీ 4 స్థానాలు, కాంగ్రెస్ 5, ఇతరులు 11 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పటిష్టంగా ఉన్నాయి.