Page Loader
ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 
ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు

ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Stalin
Jun 06, 2023
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్య‌త్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. స్టేషన్ రిలే గదులు, కాంపౌండ్స్ హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాలు తప్పనిసరిగా 'డబుల్ లాకింగ్' ఏర్పాట్లు కలిగి ఉండేలా చూసుకోవాలని భారతీయ రైల్వే సర్క్యులర్‌ జారీ జారీ చేసింది. ఈ మేరకు రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ పరిధిలోని అన్ని 'గూమ్టీలు' (ట్రాక్‌ల వెంబడి గదులు), హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే సేఫ్టీ డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ ఆదేశించింది. ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే వ్యవస్థలోని అన్ని లోపాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.

ఒడిశా

జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు రైల్వే శాఖ కీలక సూచనలు

స్టేషన్‌లలోని అన్ని రిలే గదులను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. 'డబుల్ లాకింగ్ అరేంజ్‌మెంట్' సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి. రిలే రూమ్‌లలో 'డేటా లాగింగ్, డోర్ తెరవడం/మూసివేయడం కోసం ఎస్ఎంఎస్ అలర్ట్‌ ద్వారా తనిఖీ చేసి, నిర్ధారించుకోవాలి. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ పరికరాల డిస్‌కనెక్ట్, రీకనెక్షన్ సిస్టమ్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలని రైల్వే ఆదేశించింది. డ్రైవ్ సమయంలో గుర్తించిన అన్ని లోపాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డ్రైవ్ ఫలితాలను జూన్ 14 లోపు బోర్డుకి పంపాలని ఆదేశించింది. అలాగే ఒడిశా ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వారందరినీ మంగళవారం విచారణకు పిలిచినట్లు రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న యాభై నాలుగు మంది అధికారులను విచారణకు పిలిచారు.