Page Loader
Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక అసలు కారణం.. 'గోల్డెన్‌ చాసిస్‌'తో బహిర్గతం
ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక అసలు కారణం.. 'గోల్డెన్‌ చాసిస్‌'తో బహిర్గతం

Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక అసలు కారణం.. 'గోల్డెన్‌ చాసిస్‌'తో బహిర్గతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా AI-171 విమాన ప్రమాద దర్యాప్తులో 'గోల్డెన్‌ చాసిస్‌' అనే ప్రత్యేక పరికరం కీలకంగా నిలిచింది. అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ పరికరం, ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ బ్లాక్‌బాక్స్‌ నుంచి డేటా వెలికితీయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రమాద సమయంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణత వల్ల బ్లాక్‌బాక్స్‌ దెబ్బతినడంతో, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో సంప్రదాయ ల్యాబ్‌లో డేటా డౌన్‌లోడ్‌ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు (NTSB) వినియోగించే గోల్డెన్‌ చాసిస్‌ పరికరాన్ని రప్పించారు

Details

జూన్ 12న ప్రమాదం

. ఇది గాయపడిన ఫ్లైట్‌ రికార్డర్ల నుంచి కూడా డేటాను సేకరించగలదు. అందులోని క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ను తొలగించి గోల్డెన్‌ చాసిస్‌పై అమర్చితే, ఫ్లైట్‌ డేటా, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులను సులభంగా డౌన్‌లోడ్‌ చేయొచ్చు. ఈ విధానంతో AI-171 విమానం గత ఆరు ప్రయాణాలకు సంబంధించిన మొత్తం 49 గంటల డేటాను సేకరించగలిగారు. ఇందులో ప్రమాదానికి గురైన ప్రయాణానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. జూన్ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Details

ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం

విమానం ఆసుపత్రి హాస్టల్‌పై కూలిపోవడంతో మరో 29 మంది మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, ఇంజిన్ల ఇంధన సరఫరా కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే నిలిచిపోవడం వల్లే విమానం కూలిపోయింది. పైలట్ల మధ్య జరిగిన సంభాషణల్లో కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. 'ఇంధన సరఫరా ఎందుకు నిలిపేశావ్?" అన్న ప్రశ్నకు మరో పైలట్‌ 'నేను ఆపలేదే!' అన్న సమాధానం కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో నమోదైంది. ఈ గోల్డెన్‌ చాసిస్‌ వాడకంతో దర్యాప్తులో కీలకమైన ఆధారాలు బయటపడుతున్నాయి. ఇది ప్రమాదానికి గల నిజమైన కారణాలను బహిర్గతం చేయడంలో దోహదపడనుంది.