Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఈసారి వేసవి గతంలో కంటే మరింత ఉగ్రరూపం దాల్చనుందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తించగా, మార్చి 15 తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గడిచిన వారం రోజులలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతే, ఏప్రిల్, మే నాటికి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటాయని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
Details
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 35.7°C నుంచి 37.7°C మధ్య నమోదయ్యాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లా రావినూతలలో 37.7°C గరిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదవగా, జనగామలో 35.7°C కనిష్ఠంగా నమోదైంది.
అలాగే పెద్దపల్లి జిల్లాలో 37.6°C, భద్రాద్రి, జగిత్యాల, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 37.5°C చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.