Page Loader
దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు 
దిల్లీ టూ వీలర్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు

దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాబ్ అగ్రిగేటర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్‌లు రాపిడో, ఉబర్‌ బైక్ సర్వీసులను నడపడానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. అలాగే కొత్త విధానం వచ్చే అగ్రిగేటర్లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 30 నాటికి ద్విచక్ర నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై విధానాన్ని రూపొందిస్తామని ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-టాక్సీ అగ్రిగేటర్లపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం వేసిన రెండు వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టూ వీలర్ సర్వీసుపై సుప్రీంకోర్టు తీర్పు