Page Loader
Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు
కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు

Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

Details

రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ హత్యాచార కేసును కోల్‌కతా హైకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనుంది.