మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్నా, మళ్లీ ఎందుకు దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానివ్వండని న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేష్ బిందాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది.
ఇద్దరు మణిపురి నివాసితులు చోంగ్తామ్ విక్టర్ సింగ్, వ్యాపారవేత్త మాయెంగ్‌బామ్ జేమ్స్ తరఫున తరఫు న్యాయవాది షాదన్ ఫరస్ట్ పటిషన్ దాఖలు చేశారు.
మణిపూర్
ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల జీవనోపాధిపై ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల తమ జీవితాలు, జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైందని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. మణిపూర్‌లో గత 35 రోజులకు పైగా ఇంటర్నెట్ మూసివేయబడిందన్నారు.
ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక, మానవతా, సామాజిక, మానసిక ప్రభావం పడిందని పిటిషన్‌లో వెల్లడించారు. ప్రజలు తమ పిల్లలను పాఠశాలకు పంపలేకపోతున్నారని, బ్యాంకుల నుంచి నిధులు పొందలేకపోతున్నారని, ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి మాట్లాడుతూ, హైకోర్టు ఇప్పటికే కొన్ని విషయాలపై విచారణ జరుపుతోందని, ఈ కేసును విచారించే అత్యవసరం లేదని అన్నారు. దీంతో పిటషనర్ల వాదనలకు సంతృప్తి చెందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాజ్యాన్ని కోట్టివేసింది.