Page Loader
భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వ్రాసిన వారు Stalin
Aug 02, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

వై.ఎస్.జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భారతీ సిమెంట్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన డిపాజిట్లను ఈడీ వెనక్కు ఇచ్చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చేన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన జస్టిస్‌ అభయ్‌, జస్టిస్‌ సంజయ్‌, జస్టిస్‌ ఓకాతో కూడిన ధర్మానసం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఈడీ