LOADING...
CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్ 
CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్

CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్ 

వ్రాసిన వారు Stalin
Dec 13, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రభుత్వం పగ్గాలు రెండో వారంలోనే రేవంత్ రెడ్డి అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో కీలకస్థానాల్లో ఉన్న కీలక ఐఏఎస్, ఏపీఎస్ అధికారులకు స్థానచలనాలను కలిగిస్తున్నారు. అలాగే నిజాయితీగా పని చేసే అధికారులకు మాత్రం కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. అలాగే సీఎంఓలో రేవంత్ రెడ్డి సమర్థమంతైన అధికారులను నియమించడానికి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. కొందరు అధికారులను నియమించుకున్న రేవంత్ రెడ్డి.. మిగతా ఆఫీసర్లను సీఎంఓలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. పోలీస్ శాఖలో కూడా రేవంత్ రెడ్డి తనదైన టీంను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పలువురు సీపీలను బదిలీ చేశారు.

కాంగ్రెస్

సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి?

ప్రస్తుతం సీఎంఓలో ముఖ్యమంత్రి రోజూవారి కార్యకలాపాలను చూసుకోవాడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీ స్థాయి ఆఫీసర్లు కావాలి. అయితే సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ శేషాద్రిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంఓలో సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్, ప్రియాంక వర్గీస్‌లను రేవంత్ రెడ్డి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన సలహాదారులను కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రద్దు చేసిన విషయం తెలిసిందే. కొందరు ఐఎఎస్ ఆఫీసర్లు సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో ఉండగా.. మరికొందరు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిని బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.