Page Loader
రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు
రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు వీహెచ్‌పీ నేత ఆర్బీవీఎస్ మణియన్ అరెస్టు

రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యంగాన్ని అంబేద్కర్ రాయలేదని తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించాడని కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, వారి తెలివి తేటలను బహుశా తాకట్టు పెట్టారేమో అని ఆయన నోరుపారేసుకున్నాడు. తమిళనాడులోని చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై నమోదు కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున ఆర్బీవీఎస్ మణియన్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 11న టీ-నగర్ భారతీయ విద్యాభవన్‌లో జరిగిన ఆధ్యాత్నిక కార్యక్రమంలో దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారు.

Details

మణియన్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

రాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నాడని, రాజ్యంగ నిర్మతగా ఆయనకు పేరు దక్కాలని, అంబేద్కర్‌కు కాదని మణియన్ కామెంట్ చేశారు. అంబేద్కర్ కేవలం క్లర్క్ మాత్రమే పనిచేశారని, . రాజ్యాంగాన్ని రాసినట్టు అంబేద్కర్ కూడా ఎక్కడా తన రచనల్లో పేర్కొనలేదన్నారు. అంబేద్కర్ కేవలం గుమాస్తా, టైపిస్టు, ప్రూఫ్ రీడర్ అని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో మణియన్ మీద ఐపీసీ సెక్షన్లు 153, 153A(1)(a), 505(1)(b), 505(2), సెక్షన్లు 3(1)(r), 3(1)(u), ఎస్సీ-ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని సెక్షన్ 3(1)(v) కింద కేసులు నమోదు చేశారు.