LOADING...
Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 
Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ

Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2024
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని బలంగీర్‌లోని దాదాపు 1100 మంది గ్రామస్తులు పాఠశాలలు, ఆసుపత్రులను డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు. దేశంలో సోమవారం ఐదో దశ ఎన్నికలు జరిగాయి. కానీ ఒడిశాలోని బలంగీర్‌లో 1100 మంది గ్రామస్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. బూత్‌ ప్రిసైడింగ్‌ అధికారి రును మెహర్‌ మాట్లాడుతూ.. అప్పటికే సమయం రెండు గంటలు కావస్తున్నదని, ఇంకా ఎవరూ ఓటు వేయడానికి రాలేదన్నారు. మాక్ పోల్ నిర్వహించాలనుకొని, కొన్ని పోలింగ్‌ ఏజెన్సీల నుంచి సహాయం తీసుకోవాలనుకున్నామని, అయితే మాకు ఏ ఏజెంట్‌ దొరకలేదని ఆయన అన్నారు. ఉదయం నుంచి ఓటర్ల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఓటు వేయడానికి రాలేదని అన్నారు.

Details 

గ్రామంలో 1780 మంది ఓటర్లు

ఈ విషయమై కొందరు గ్రామస్తులతో మాట్లాడగా.. తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో ఓటింగ్‌ను బహిష్కరించినట్లు వెల్లడించారు. మా ఫిర్యాదులను అందరికీ చెప్పామని, అయితే ఎవరూ వినలేదని అన్నారు. మా గ్రామంలో పాఠశాలలు లేవు, రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. రేషన్ కూడా దొరకడం లేదు. డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు. మా సమస్యలను పలువురు అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న గ్రామంలో 1780 మంది ఓటర్లు ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న బూత్‌ ప్రిసైడింగ్‌ అధికారి