Page Loader
HMVP: చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

HMVP: చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో హ్యూమన్‌ మెటాన్యుమోనియా (హెచ్‌ఎంపీవీ)తో సహా శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం భరోసా ఇచ్చింది. చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి పరిస్థితిని అంచనా వేయడానికి శనివారం సంయుక్త పర్యవేక్షణ గ్రూపు సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Details

ఆందోళన అవసరం లేదు

హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ వద్ద మౌలిక వసతులు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు చైనాలో పిల్లులు ఫీలైన్‌ ఇన్ఫెక్షియస్‌ పెర్టోనిటిస్‌ అనే ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ పిల్లులకు కొవిడ్‌కు ఉపయోగించిన మందులను వేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.