LOADING...
Sofia Qureshi : వెనకడుగే లేదు.. పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌
వెనకడుగే లేదు.. పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌

Sofia Qureshi : వెనకడుగే లేదు.. పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ తన దుందుడుకు ప్రవర్తనను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. గురువారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్‌ జెట్లతో దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా శ్రీనగర్‌, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వంటి కీలక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ యుద్ధ విమానాలు చొచ్చుకురావాలని ప్రయత్నించాయని భారత సైన్యం తెలిపింది. ఈ విషయాన్ని కల్నల్‌ సోఫియా ఖురేషి వెల్లడించారు. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తోందని ఆమె పేర్కొన్నారు.

Details

S-400 సురక్షితం

అయితే భారత సైన్యం పాక్‌ దాడులకు సమర్థవంతంగా ప్రతిస్పందిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి జరిగిన ఘటనల్లో 24 వైమానిక ప్రాంతాలపై పాక్‌ కుట్రలు సాగించిందని సోఫియా ఖురేషి తెలిపారు. పాక్‌ శ్రీనగర్‌, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వంటి కీలక స్థావరాలపై దాడి చేసేందుకు యత్నించిందని చెప్పారు. కానీ భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి వాటిని తిప్పికొట్టిందని పేర్కొన్నారు. అంతేకాకుండా పాక్‌ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ ప్రతిదాడులు కూడా జరిపిందని, భారత్‌ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందని వివరించారు. అలాగే ఈ ప్రతిదాడుల్లో బాలిస్టిక్‌ క్షిపణుల వినియోగం కూడా జరిగిందని చెప్పారు. S-400 ధ్వంసమైందన్న పాక్‌ ప్రకటన పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు.

Details

ఉద్రిక్తతలను పెంచుతున్న పాక్

ఈ వరుస దాడుల నేపథ్యంలో పాక్‌ ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. అయితే భారత రక్షణ దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ శత్రు దేశపు ప్రతి కుట్రను విఫలం చేస్తున్నాయి. కల్నల్‌ సోఫియా ఖురేషి ప్రకారం భారత రక్షణ వ్యవస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పాక్‌ ఈ దూకుడు చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె హెచ్చరించారు. ఇక మరోవైపు భారత వైమానిక దళం కూడా పాక్‌ యుద్ధ విమానాలను సమర్థవంతంగా అడ్డుకుందని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణహానీ లేదా ఆస్తినష్టం జరగకుండా భారత దళాలు తక్షణ స్పందనతో చురుకుగా వ్యవహరించాయి. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది.

Advertisement