LOADING...
MK Stalin: కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం
కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం

MK Stalin: కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం-తమిళనాడు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్‌ మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీ భాషను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తమిళ భాషపై నిజమైన ప్రేమ ఉంటే, దాన్ని చేతల్లో చూపించాలని ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

Details

చేతల్లో చూపించాలి

ప్రధాని మోదీకి తమిళంపై అపారమైన ప్రేమ ఉందని బీజేపీ చెబుతోందని, అది నిజమైతే ఆయన చేతల్లో ఎందుకు చూపించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు. పార్లమెంటులో సెంగోల్‌ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని, రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించి, తమిళాన్ని అధికార భాషగా చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ప్రస్తావించడమే కాకుండా, రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, విపత్తు సహాయ నిధులు, కొత్త రైల్వే ప్రాజెక్టులను కేటాయించాలన్నారు. అంత్యోదయ, తేజస్‌, వందేభారత్‌ రైళ్లకు తమిళ పేర్లు పెట్టాలని, తమిళంపై ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

Details

తమిళనాడు గొంతు నొక్కేస్తున్నారు: స్టాలిన్ 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్‌ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు 12 పార్లమెంటు స్థానాలు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమిళనాడు రాజకీయాలపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. తమిళనాడు గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.