
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన టాప్ టెర్రరిస్టులు వీళ్లే.. వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ప్రభావం రోజురోజుకీ బయటపడుతోంది.
మే 7 అర్ధరాత్రి తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో నిర్వహించిన ఈ మెరుపుదాడుల్లో భారత వాయుసేన తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
వీరిలో ఐదుగురు కీలక ఉగ్రవాద నేతలు ఉన్నట్టు సమాచారం. తాజాగా ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Details
హతమైన ఉగ్రనాయకుల వివరాలు ఇలా ఉన్నాయి
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్
లష్కరే తయ్యిబా కు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ అధికారికంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ పోలీస్ సీఎం, ఐజీ హాజరయ్యారని సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
2. హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే
మహమ్మద్ కీలక నేత. సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. భారత వైమానిక దాడుల్లో మృతి చెందాడు.
Details
3. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ/సలీమ్/సాహబ్
జైషే కీలక ఉగ్రవాది. మసూద్ అజార్ బావమరిది. 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన పాత్రధారి.
4. ఖలీద్ అలియాస్ అబు అకాస
లష్కరే తోయిబా టాప్ కమాండర్. జమ్మూ కశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నాయకత్వం వహించాడు. అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేసేవాడు.
ఇతడి అంత్యక్రియలకు పాక్ సైనిక అధికారులు, డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారని తెలిసింది.
Details
5. మహమ్మద్ హసన్ ఖాన్
జైషే మహ్మద్ సభ్యుడు. పీఓకేలోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను చొప్పించడంలో కీలకంగా వ్యవహరించాడు.
భారత్ లక్ష్యంగా చేసుకున్న శిబిరాల్లో లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం మురిద్కే (లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో) కీలకం.
ముంబయి 26/11 దాడుల్లో పాలుపంచుకున్న అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి ఇక్కడే శిక్షణ ఇచ్చారు. జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్‌పైనా భారత్ దాడి చేసింది.
ఇందులో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందినట్లు సమాచారం.