LOADING...
Independence Day celebrations: 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయోత్సవంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
'ఆపరేషన్‌ సిందూర్‌' విజయోత్సవంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Independence Day celebrations: 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయోత్సవంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయోత్సవంగా దేశవ్యాప్తంగా జరపనున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ దళాలు, పారా మిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయాన్ని ప్రతిబింబించడంతో పాటు, 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంగీత సౌరభాన్ని అందించాలనే ఉద్దేశ్యం ఉంది. రక్షణశాఖ ప్రకారం, ఈ ప్రదర్శనలు దేశ పౌరులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. అలాగే ఈ వేడుకల ఆహ్వాన పత్రికపై 'ఆపరేషన్‌ సిందూర్‌' లోగోతో పాటు, అద్భుత ఇంజినీరింగ్‌ కట్టడం అయిన ప్రతిష్ఠాత్మక చినాబ్‌ బ్రిడ్జి రేఖా చిత్రాన్ని ముద్రించారు.