Page Loader
Apache AH-64S: భారత్‌కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ
భారత్‌కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ

Apache AH-64S: భారత్‌కు మూడు అపాచీ హెలికాప్టర్లు.. అమెరికా నుంచి తొలి విడత డెలివరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తయారు చేసిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు త్వరలో ఇండియాకు చేరుకోనున్నాయి. మొదటి బ్యాచ్‌లో మూడు అపాచీలు ఉండగా, వీటిని భారత వైమానిక దళానికి అందజేయనున్నారు. రాత్రి సమయంలోనూ శత్రుదళాలను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది. అపాచీ ఏహెచ్-64ఎస్ (AH-64E Apache) అనే ఈ హెలికాప్టర్‌లు ఇప్పటికే అమెరికా సైన్యంలో ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించాయి. అమెరికా ఇప్పటివరకు దాదాపు 20 దేశాలకు ఈ హెలికాప్టర్లను సరఫరా చేసింది. భారత్ వీటిని పాక్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

Details

3.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం

ఈ హెలికాప్టర్‌ను 'ఎరియల్ ట్యాంక్' అని పిలుస్తారు. మొదటి బ్యాచ్‌లోని హెలికాప్టర్లు ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ కానున్నాయి. భారత ప్రభుత్వం 2015లో బోయింగ్ సంస్థకు 22 అపాచీల కోసం 3.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే పఠాన్‌కోట్‌, జోర్హాట్‌ బేస్‌లలో ఈ హెలికాప్టర్లతో రెండు స్క్వాడ్రన్లు చురుగ్గా పనిచేస్తున్నాయి. 2020లో భారత్ మరో ఆరు అపాచీల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో మొదటి బ్యాచ్ 2024 మే-జూన్ మధ్య డెలివరీ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.

Details

మరింత బలపడనున్న సరిహద్దు భద్రత

ప్రస్తుతం మూడు అపాచీలు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా, వీటి ద్వారా సరిహద్దు భద్రత మరింత బలపడనుంది. ఇప్పటికే ప్రత్యేక ఫ్లీట్‌ను సిద్ధం చేసిన భారత సైన్యం వాటిని సమర్థంగా వినియోగించనుంది. ఈ అపాచీ హెలికాప్టర్ ముందు భాగంలో 30 ఎంఎం గన్ అమర్చారు. కేవలం రెండు నిమిషాల్లోనే 1,200 రౌండ్లు కాల్చగలదు. ఇది 80 రాకెట్లు, హెల్‌ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలదు. అదనంగా, ఒక నిమిషంలో 128 లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. చీకటి వాతావరణంలోనూ సమర్థవంతంగా పనిచేయగల ఈ హెలికాప్టర్లు, భారత సైన్యానికి కీలక బలం అయ్యే అవకాశం ఉంది.