
BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
ఇప్పుడు 3రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికలపై బీజేపీ నాయకత్వం తీవ్రమైన కసరత్తులు చేస్తోంది.
3రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవుల కోసం మాజీ సీఎంలతో పాటు కొత్త వారిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎంల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రుల ఎంపికపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో నాలుగున్నర గంటలపాటు చర్చించారు.
ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సీఎంల ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో సీఎంల ఎంపికకోసం మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించే అవకాశముంది.
బీజేపీ
సీఎం రేసులో ముందున్నది వీళ్లే
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు.
అలాగే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా పోటీలో ఉన్నారు.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లో సీఎం పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్ ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ సావో, ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ ఓపీ చౌదరి సీఎం పదవికి పోటీ పడుతున్నారు.