Page Loader
Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

వ్రాసిన వారు Stalin
Aug 05, 2023
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయినట్లు శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ట్వీట్‌లో పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఆర్మీ సిబ్బంది నుంచి ఓ ఉగ్రవాది నాలుగు ఏకే-47 రైఫిళ్లను తీసుకెళ్లాడు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్మీ చేసిన ట్వీట్