Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు
హైదరాబాద్ లోని పాతబస్తీలో రౌడీషీటర్ ను దుండగలు కాల్చి చంపారు. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో గ్యాంగ్ స్టర్ రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు చేసి హత్య చేశారు. దీంతో రియాజ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గురువారం రాత్రి ఈఘటన చోటు చేసుకుంది. మీరాపేట్‌లో నివాసం ఉంటున్న రియాజ్ బైక్‌పై వెళుతుండగా ప్రత్యర్థులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మృతుడు రియాజ్‌ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు ఫ్రూట్ మర్చంట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.