
తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల నడకమార్గంలో చిరుతపులి దాడిలో బాలిక మృతి చెందిన ఘటనను టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ సీరియస్‌గా తీసుకుంది.
ఈ క్రమంలో బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడంతో పాటు తిరుమల నడక మార్గంలో చిరుతుల బెడద లేకుండా చేసేందుకు టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా నడక మార్గంలో సంచరిస్తున్న మరో చిరుత అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో ఆదివారం రాత్రి చిక్కింది.
ఈ చిరుత నాలుగు రోజులుగా బోనులో చిక్కకుండా తప్పించుకుపోతోంది. బోను దగ్గరికి వచ్చి, వెనక్కి మళ్లీ పోతోంది. 7వ మైలు సమీపంలో చిరుతపులిని పట్టుకున్నారు.
తిరుపతి
ఈ నాలుగు చిరుతల్లో బాలికపై దాడి చేసిన దానిని గుర్తిస్తాం: సీసీఎఫ్
నాలుగో చిరుతను ట్రాప్ చేయడంపై తిరుమల చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) నాగేశ్వర్ రావు స్పందించారు. తాజాగా చిరుతను పట్టుకోవడంతో ఆపరేషన్ పూర్తయినట్లు చెప్పారు.
గత నెలలో చిరుతపులి దాడితో మృతి చెందిన బాలిక శరీరంపై చిరుత వెంట్రుకలు కనిపించాయని వెల్లడించారు. సమగ్ర డీఎన్ఏ సీక్వెన్సింగ్‌ను పరిశీలించి, ఈ నాలుగు చిరుతల్లో ఏది దాడి చేసింది అనేది తేల్చుతామని ఆయన వివరించారు.
అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు దాదాపు 300 మోషన్-డిటెక్టెడ్ కెమెరాలను ఏర్పాటు చేశామని నాగేశ్వర్ రావు తెలిపారు.
తిరుపతికి వెళ్లే భక్తులకు భద్రతను పెంచేందుకు అటవీ శాఖ నిబద్ధతను పటిష్టం చేస్తూ అదనంగా 500 కెమెరాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బోనులో చిక్కిన చిరుత
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. ఏడో మైలు వద్ద ఆదివారం 7 గంటల ప్రాంతంలో చిరుత చిక్కినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. pic.twitter.com/Ig4FyAK4dt
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 28, 2023