తదుపరి వార్తా కథనం

Train: నవంబరు 2 నుంచి తిరుపతి-అనకాపల్లి ప్రత్యేక రైలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 08, 2025
12:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సేవను ప్రారంభిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ కొత్త ప్రత్యేక రైలు సర్వీస్ ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణ సౌకర్యం మరింత సులభం అవుతుంది. నంబరు 07481 ప్రత్యేక రైలు నవంబరు 2 నుండి 30 వరకు ప్రతి ఆదివారం తిరుపతిలో నుండి ప్రయాణం ప్రారంభిస్తుంది. తిరుగు ప్రయాణం కోసం నంబరు 07482 ప్రత్యేక రైలు డిసెంబరు 1 వరకు ప్రతి సోమవారం అనకాపల్లి నుండి బయల్దేరుతుంది. ఈ రైలు ప్రయాణంలో శ్రీకాళహస్తి,నెల్లూరు,చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు ఈ రైలు సౌకర్యవంతమైన, వేగవంతమైన మరియు సమయపాలనతో కూడిన మార్గాన్ని అందిస్తుంది అని అధికారులు పేర్కొన్నారు.