Three minors stab Delhi man: వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. ఆపై డెడ్‌బాడీకి నిప్పు
ఆగ్నేయ దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు 25 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఆ తర్వాత అతని శరీరానికి ఎండు గడ్డి, గుడ్డతో నిప్పంటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై బాధితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. డిసెంబర్ 23 రాత్రి జరిగిన సంఘటన గురించి సమాచారం అందుకున్న తరువాత 16,17 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు యువకులను పట్టుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. వ్యక్తిని కత్తితో పొడిచి, అతని మృతదేహాన్ని ఖుస్రో పార్క్ సమీపంలో ఉంచారు. నిందితులను నిజాముద్దీన్ బస్తీ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
మృతదేహాన్ని పొడి గడ్డి,గుడ్డలతో కాల్చడానికి ప్రయత్నం
ఆ వ్యక్తిని తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారని,ఆ తర్వాత యువకులతో పాటు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని,పార్కులో సగం కాలిన మృతదేహం కనిపించిందని పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్నిఎయిమ్స్‌కి పంపినట్లు పోలీసులు తెలిపారు.హత్య,నేరానికి సంబంధించిన సాక్ష్యాలను దాచిపెట్టడంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. డిసెంబర్ 21 రాత్రి ఆ వ్యక్తిని హత్య చేసి,పొడి గడ్డి,గుడ్డలతో అతని మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం,రాళ్ళు,కర్రను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు హజ్రత్ నిజాముద్దీన్ కి చెందినవాడు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు. భాధితుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుల్లో ఒకరు హత్యకు పథకం రచించారని పోలీసులు తెలిపారు.