నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర పద్దును అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలలో డిప్యూటీ సీఎం అంజాద్ పాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయ్యాక.. అసెంబ్లీ, మండలిలలో వేర్వేరుగా వ్యవసాయ బడ్జెట్లను చదవనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మండిలో మంత్రి సిదిరి అప్పలరాజు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023-24 నవరత్నభరింతగా ఉండనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఏడాదికి గాను వార్షి బడ్జెట్ రూ.2.79లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు సమాచారం.
24వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కృషినట్లు తెలుస్తోంది. మరోవైపు నాలుగేళ్ల పాలనతోపాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక అంశాలపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.