Page Loader
Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం
నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్‌ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. శ్రీనగర్-లేహ్‌ జాతీయ రహదారిపై రూ.2,400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం 6.4 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ సొరంగం ద్వారా ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. సొరంగ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ రాకను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

Details

 ఎస్పీజీ భద్రతా చర్యలు 

భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్‌లు, వైమానిక, సాంకేతిక నిఘాను ఉపయోగిస్తున్నారు. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని శనివారం నుంచి సోమవారం వరకు తాత్కాలికంగా మూసివేశారు. జెడ్-మోర్ సొరంగం ప్రారంభోత్సవ వేదికను ఎస్పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గగాందీర్ ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ర్యాలీ నిర్వహించి ప్రసంగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సొరంగం ప్రత్యేకతలు ఈ సొరంగం పూర్తయిన తర్వాత ఏడాదిలో ఎప్పుడైనా లద్దాఖ్‌కు రోడ్డు మార్గం అందుబాటులో ఉంటుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊతం ఇచ్చే ప్రాజెక్టుగా నిలవనుంది. సొరంగం ప్రారంభం ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, వ్యాపార కార్యకలాపాలకు సులభతరం అవుతుంది.