
Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.
జైపూర్ బీజేపీ కార్యాలయంలో సాయంత్రం 4గంటలకు శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కానుంది.
ఈ సమావేశంలో బీజేపీ ఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తావ్డే హాజరుకానున్నారు.
కొత్త ముఖ్యమంత్రిగా దళిత నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని అరుణ్ సింగ్ సోమవారం పేర్కొన్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్‌లు ఉన్నారు.
బీజేపీ
రాజస్థాన్‌లో ఇలా తొలిసారి
నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
ఎన్నికల్లో పోటీ చేసిన 199 స్థానాలకు గాను బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ ఇన్ని తాత్సారం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించేంది.
మాజీ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్, వసుంధర రాజే హయాంలో ఇలాగే చేసింది.
కానీ ఈసారి బీజేపీ తన వ్యూహం మార్చింది. కమలం పువ్వు, ప్రధాని మోడీ ఇమేజ్‌తోనే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది.
మంగళవారం సాయంత్రంతో ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలే అవకాశం ఉంది.