
నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.
ఈక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన రాజ్యసభ సభ్యులకు ఆగస్టు 7, 8 తేదీల్లో సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.
దిల్లీ బ్యూరోక్రసీపై ఎన్నుకోబడిన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ బ్యూరోక్రసీ కేంద్రం పరిధిలోకి వచ్చేలా మోదీ ప్రభుత్వం వివాదాస్పదమైన ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లును తీసుకొస్తుంది.
ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లుపై ఆప్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం హాజరు కావాలని తమ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ బిల్లును వ్యతిరేకించేందుకు మేం సిద్ధం: ఆప్ ఎంపీ సందీప్
VIDEO | "We are well prepared and will oppose this Bill tooth and nail. It's not going to be as easy for them as in the Lok Sabha," says AAP MP @SandeepPathak04 on Delhi Services Bill, which is likely to be tabled in the Rajya Sabha today. pic.twitter.com/02M7GeruPf
— Press Trust of India (@PTI_News) August 7, 2023